యూపీ సర్కార్‌పై ప్రియాంక తీవ్ర విమర్శలు

దిశ, వెబ్‌డెస్క్: యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దారుణంగా ఉందన్నారు. కేవలం కరోనా నివారణ అనే ప్రచారం మాత్రమే చేస్తున్నారని దుయ్యబట్టారు. వైరస్ కట్టడిపై సీఎం యోగి ఆదిత్యానాథ్ సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. హాస్పిటల్‌లో తగినంత సంఖ్యలో బెడ్స్ ఉన్నాయని సీఎం, అనుచరులు చెబుతున్నారని.. నివేదికలను చూస్తే మాత్రం వాస్తవ పరిస్థితి ఆందోళన […]

Update: 2020-07-19 08:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దారుణంగా ఉందన్నారు. కేవలం కరోనా నివారణ అనే ప్రచారం మాత్రమే చేస్తున్నారని దుయ్యబట్టారు. వైరస్ కట్టడిపై సీఎం యోగి ఆదిత్యానాథ్ సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. హాస్పిటల్‌లో తగినంత సంఖ్యలో బెడ్స్ ఉన్నాయని సీఎం, అనుచరులు చెబుతున్నారని.. నివేదికలను చూస్తే మాత్రం వాస్తవ పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు. ఇటువంటి అసమర్థ నిర్వహణతో రాష్ట్రంలో దారుణ పరిస్థితులకు దారి తీసిందని ప్రియాంక చెప్పుకొచ్చారు. అలాగే, బెడ్స్ కోసం కరోనా రోగులు చాలా సేపు వేచి ఉంటున్నారంటూ ఆమె ట్వట్టర్‌లో వెల్లడించారు.

Tags:    

Similar News