అలకబూనిన తుమ్మేటి.. ఈటల నిజంగా మారిపోయారా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన సన్నిహితుడు ఒకరు షాకిచ్చినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా అత్యంత సన్నిహితంగా మెదిలిన వారిద్దరూ గత వారం రోజులుగా దూరంగా ఎందుకుంటున్నారన్నదే అసలైన చర్చ. ఇంతకీ ఆ నాయకుడు అలక బూనడానికి కారణం ఏంటో తెలుసా..? కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో చేరి ఈటలతో అత్యంత సాన్నిహిత్యంగా మెదులుతున్న జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఈటలతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన సన్నిహితుడు ఒకరు షాకిచ్చినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా అత్యంత సన్నిహితంగా మెదిలిన వారిద్దరూ గత వారం రోజులుగా దూరంగా ఎందుకుంటున్నారన్నదే అసలైన చర్చ. ఇంతకీ ఆ నాయకుడు అలక బూనడానికి కారణం ఏంటో తెలుసా..?
కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో చేరి ఈటలతో అత్యంత సాన్నిహిత్యంగా మెదులుతున్న జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఈటలతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ ఎపిసోడ్ తరువాత ఈటల వద్దకు కూడా వెల్లకుండా తుమ్మెటి తన ఇంటికే పరిమితం అయ్యారు. నాలుగు రోజులుగా హుజురాబాద్‌లోనే మకాం వేసిన ఈటలను కలిసేందుకు కూడా సమ్మిరెడ్డి వెల్లనట్టుగా సమాచారం. నిన్న మొన్నటివరకు ఈటల వెన్నంటి నడిచిన సమ్మిరెడ్డి అనూహ్యంగా అదృశ్యం కావడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతు చిక్కకుండా తయారైంది.
ఢిల్లీ టూర్‌తోనే నా..?
బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెల్లిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరే లాంఛనం కోసం జాతీయ నాయకుల వద్దకు వెల్లిన ఈటల తన వెంట సమ్మిరెడ్డిని తీసుకెళ్లకపోవడమే కినుకకు కారణమని తెలుస్తోంది. కాషాయం కండువా కప్పుకునేందుకు జాతీయ నాయకుల వద్దకు వెళ్లే జాబితాలో సమ్మిరెడ్డి పేరు లేకపోవడంతో ఆయన మనస్థాపానికి గురైనట్టు సమాచారం. కొవిడ్ కారణంగా ఈటల వెంట వచ్చిన వారందరినీ లోపలకు రావద్దని కేవలం 25 మంది మాత్రమే రావాలని బీజేపీ నాయకులు సూచించారు. ఇందుకు సంబంధించిన జాబితాను ఈటల బీజేపీ నాయకులకు పంపించారు. ఈ లిస్ట్‌లో తుమ్మేటి పేరు లేకపోవడం చూసి షాక్‌కు గురైన ఆయన ఢిల్లీ నుండి వచ్చిన తరువాత నేరుగా జమ్మికుంటకు వెళ్లిపోయారు. అప్పటి నుండి ఈటలతో టచ్‌లో ఉండటం లేదని తెలుస్తోంది.
బీజేపీలో చేరిన తరువాత తొలిసారిగా హుజురాబాద్‌కు వచ్చిన ఈటలను కలిసేందుకు కూడా సమ్మిరెడ్డి వెళ్లనట్టు సమాచారం. ఢిల్లీలో జాయినింగ్ అప్పుడు తన పేరు ఉండకుండా ఈటల సమీపంలో ఉండే వారు స్కెచ్ వేశారని తెలుసుకున్న ఆయన మనస్థాపానికి గురైనట్టు సమాచారం. అయితే సమ్మిరెడ్డి ఎందుకు రావడం లేదన్న విషయంపై ఈటల కూడా అంతగా పట్టించుకోకపోవడంతో సమ్మిరెడ్డి బాధపడుతున్నట్టు తెలుస్తోంది. తనను ఇగ్నోర్ చేస్తున్నారా ఏంటీ అని సమ్మిరెడ్డి తన సన్నిహితుల వద్ద బాధ పడుతున్నట్టుగా తెలిసింది. ఇంత జరిగినా ఈటల నుండి మాత్రం పిలుపు రాకపోవడం ఏమై ఉంటుందా అని సమ్మిరెడ్డి వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఈటల బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న తరువాత నుండి మారిపోయారన్న అభిప్రాయాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఈటల సమ్మిరెడ్డి విషయంలో ఎలా ముందుకు సాగుతారో వేచి చూద్దాం అన్న ధోరణీలో ఆయన వర్గీయులు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏది ఏమైనా ఈటల బీజేపీ ఎంట్రీ తరువాత రానున్నకాలంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ సాగుతోంది.