ఎన్ఆర్ఐ ఔదార్యం

దిశ, కరీంనగర్: మూడు దశాబ్దాల క్రితం లండన్ లో వైద్యునిగా స్థిరపడ్డ ఆయన కరోనా కల్లోలంతో అతలాకుతలం అయిన వారికి బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. కరోనా లాక్ డౌన్ తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి తనవంతుగా సాయం అందించాలని భావించారు. తన తండ్రి భువనగిరి సత్యనారాయణ జ్ఞాపకార్థం నిరుపేదలకు సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కుటుంబాలకు నిత్యవసరాలను పంపిణీ […]

Update: 2020-05-18 00:21 GMT

దిశ, కరీంనగర్: మూడు దశాబ్దాల క్రితం లండన్ లో వైద్యునిగా స్థిరపడ్డ ఆయన కరోనా కల్లోలంతో అతలాకుతలం అయిన వారికి బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. కరోనా లాక్ డౌన్ తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి తనవంతుగా సాయం అందించాలని భావించారు. తన తండ్రి భువనగిరి సత్యనారాయణ జ్ఞాపకార్థం నిరుపేదలకు సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కుటుంబాలకు నిత్యవసరాలను పంపిణీ చేయాలని తన బంధువులను కోరారు. ఈ మేరకు రామన్నపేట గ్రామ సర్పంచ్ కన్నం మధు, ఎంపీటీసీ అక్కనపెల్లి ఉపేందర్ లు పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులకు, నిరుపేదలకు నిత్యవసరాలను అందజేశారు.

Tags:    

Similar News