ఘట్‌కేసర్‌లో నార్త్ అమ్మాయిల నయా మోసం

దిశ, ఘట్ కేసర్: స్వచ్ఛంద సంస్థ పేరుతో కొంతమంది యూపీకి చెందిన అమ్మాయిలు మోసానికి పాల్పడుతున్నారు. పేదవారికి సాయం చేస్తున్నామంటూ రహదారిపై వచ్చిపోయేవారి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ రకం మోసం సోమవారం ఘట్ కేసర్ మండలంలో వెలుగులోకి వచ్చింది. కొంతమంది ఈజీ మనీకి అలవాటుపడిన ఉత్తర్ ప్రదేశ్ యువతులు ఘట్ కేసర్ లోని హైదరాబాద్-వరంగల్ రహదారిపై వాహనాలను ఆపి సంస్థ పేరు చెప్పకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరు గత కొంతకాలంగా ఇదే తరహాలో వాహనదారుల […]

Update: 2021-03-01 09:14 GMT

దిశ, ఘట్ కేసర్: స్వచ్ఛంద సంస్థ పేరుతో కొంతమంది యూపీకి చెందిన అమ్మాయిలు మోసానికి పాల్పడుతున్నారు. పేదవారికి సాయం చేస్తున్నామంటూ రహదారిపై వచ్చిపోయేవారి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ రకం మోసం సోమవారం ఘట్ కేసర్ మండలంలో వెలుగులోకి వచ్చింది. కొంతమంది ఈజీ మనీకి అలవాటుపడిన ఉత్తర్ ప్రదేశ్ యువతులు ఘట్ కేసర్ లోని హైదరాబాద్-వరంగల్ రహదారిపై వాహనాలను ఆపి సంస్థ పేరు చెప్పకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు.

వీరు గత కొంతకాలంగా ఇదే తరహాలో వాహనదారుల నుండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఓకే… లేదంటే ఈ కిలేడీలు రెచ్చిపోతారు. నోటికొచ్చినట్టు డబ్బులు ఇవ్వని వారిని దుర్భాషలాడడం స్టార్ట్ చేస్తారు. ఇదే విషయమై కొంతమంది పోలీసులకు సమాచారం అందించగా… అధికారులు ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో హైవేపై హైక్లాస్ గా దోచుకుంటున్న ఈ నార్త్ బ్యూటీస్ కి బ్రేక్ పడింది. కాగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ముఠాలు ఉన్నాయని.. వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News