whisky drinking challenge : ప్రాణం తీసిన లిక్కర్ పందెం.. రూ.75వేల కోసం ఆశపడితే..

పందెంలో భాగంగా రెండు బాటిళ్ల విస్కీ ఆపకుండా తాగిన ఓ వ్యక్తి మృతి చెందాడు.

Update: 2024-12-30 12:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పందెంలో భాగంగా రెండు బాటిళ్ల విస్కీ ఆపకుండా తాగిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన థాయ్ లాండ్‌లో చోటు చేసుకుంది. బ్యాంకాక్ పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తనకర్న్ కంథీ(21) ‘బ్యాంక్ లీసెస్టర్’గా సోషల్ మీడియా పేరు సంపాదించాడు. డబ్బుల కోసం గతంలో హ్యాండ్ సానిటైజర్ సైతం తాగాడు. ఇటీవల ఓ పార్టీలో పాల్గొన్న అతను 350ఎంఎల్ రెజెన్సీ బాటిల్ విస్కీ తాగేందుకు రూ.75వేల వరకు పందెం కాశాడు. 20 నిమిషాల్లో రెండు బాటిళ్లు తాగేశాడు. తర్వాత అల్కహాల్ పాయిజనింగ్ కావడంతో స్పృహ కొల్పోయాడు. హుటాహుటిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కంథీతో ఈ పందెం కాసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఎక్కాచార్ట్‌గా పోలీసులు గుర్తించారు. గతంలో కంథీ ఓ వీడియోలో తన కుటుంబాన్ని పోషించేందుకే తాను బెట్టింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు.

Tags:    

Similar News