కొడుకుకు ఖేల్ రత్న అవార్డు రావడంపై గుకేష్ తల్లి స్పందన
భారత ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న, అర్జున అవార్డులను ప్రకటించింది.
దిశ, వెబ్ డెస్క్: భారత ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న(Khel Ratna), అర్జున అవార్డుల(Arjuna Award)ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్(World Chess Champion) గా నిలిచిన ఆయన గుకేష్ (Gukesh)కు ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డును కేంద్ర ప్రకటించింది. కాగా 18 ఏళ్ల యువకుడు గుకేష్‌కు ఖేల్ రత్న అవార్డు రావడంపై ఆమె తల్లి పద్మ కుమారి(Padma Kumari) స్పందిస్తూ.. తన కొడుకు అతి చిన్న వయస్సులో ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డు రావడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అలాగే తనకు ఎంతో ఆనందంగా ఉందని ఒక తల్లిగా తనకు ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఈ ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డులతో పాటు, అర్జున అవార్డులను ఈ నెల 17న ఉదయం 11:00 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కాగా క్రీడాకారులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేయనున్నారు.
Read More ....
Rajiv Khel Ratna: కేంద్రం సంచలన నిర్ణయం.. మను బాకర్, గుకేశ్‌లకు ఖేల్‌రత్న పురస్కారం