IIT Bombay : ఐఐటీ బాంబే కంప్యూటర్ ల్యాబ్‌కు నిప్పు

మహారాష్ట్ర(Maharashtra)లోని ఐఐటీ బాంబే(IIT Bombay)లోని కంప్యూటర్‌ ల్యాబ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నిప్పుపెట్టాడు.

Update: 2025-01-04 17:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లోని ఐఐటీ బాంబే(IIT Bombay)లోని కంప్యూటర్‌ ల్యాబ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో ల్యాబ్ లోని కంప్యూటర్లు, ఏసీలు, ప్రాజెక్టర్‌, కుర్చీలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. న్యూ ఇయర్‌ ఈవ్‌ అయిన డిసెంబర్‌ 31న ఈ సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో పొవాయ్‌లోని ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ ల్యాబ్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. కిరోసిన్‌ పోసి ల్యాబ్‌కు నిప్పంటించి పారిపోయాడు. పొగలు, మంటలు గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్‌ చేశాడు. ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. సుమారు రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా అధికారులు వేశారు.

Tags:    

Similar News