చైనాలో సరికొత్త వైరస్ కలకలం.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం
చైనాలో గత కొన్ని వారాలుగా.. కొత్తరకం వైరస్(new type of virus) కారణంగా.. శ్వాసకోశ వ్యాధులు(Respiratory diseases) విపరీతంగా పెరుగుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: చైనాలో గత కొన్ని వారాలుగా.. కొత్తరకం వైరస్(new type of virus) కారణంగా.. శ్వాసకోశ వ్యాధులు(Respiratory diseases) విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆ దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న శ్వాసకోశ వ్యాధుల దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Ministry of Health) కీలక నిర్ణయం తీసుకుంది. చైనా వైరస్(China virus) పై జాయింట్ మానిటరింగ్ గ్రూప్(Joint Monitoring Group)ను ఏర్పాటు చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Ministry of Health) అందుబాటులో ఉన్న అన్ని ఛానెల్‌ల ద్వారా చైనాలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది పరిస్థితికి సంబంధించిన అప్‌డేట్ ను ఎప్పటికప్పడు భారత్‌కు అందించాలని WHOను భారత్ అభ్యర్థించింది. అలాగే చైనాను వణికిస్తున్న శ్వాసకోశ వ్యాధులను(Respiratory diseases) ఎదుర్కొవడానికి భారతదేశం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.