Maha Kumbhamela : ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న హరివంశ గిరి బాబా.. ఆయన ప్రత్యేకత ఇదే
ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో ఈనెల 13వ తేదీ నుంచి మహాకుంభ మేళా(Maha Kumbhamela) జరగనున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో ఈనెల 13వ తేదీ నుంచి మహాకుంభ మేళా(Maha Kumbhamela) జరగనున్న విషయం తెలిసిందే. భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించనున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వేలాది సాధువులు, బాబాలు ప్రయాగ్‌రాజ్‌కు క్యూ కడుతున్నారు. వారిలో దిగంబర హరివంశ గిరి బాబా(Hrivansha Giri Baba) కూడా చేరుకున్నాడు. ఎవరీ బాబా అనుకుంటున్నారా..? హరివంశ బాబా గత అయిదేళ్ల నుంచి తన ఎడమ చేతిని లేపి ఉంచారు. 12 ఏళ్ల పాటు తన చేయిని లేపి ఉంచాలని దీక్ష పూనినట్లు ఆయన చెప్పారు. నేతలు, ఆఫీసర్లు చాలా వివేకంతో వ్యవహారిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. దేశం అభివృద్ధి పథంలో వెళ్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. సనాతన ధర్మానికి ఆరంభం, అంతం లేదని, దాని గురించి తాను ఏమీ చెప్పలేననని, అది ఎవరికి వారు స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. కాగా హరివంశ గిరి బాబాను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటం గమనార్హం.