Breaking News : కెనెడా ప్రధాని రాజీనామా

కెనెడా(Canada) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Update: 2025-01-06 16:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : కెనెడా(Canada) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా లిబరల్ పార్టీ(Liberal Party) అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ట్రూడో ప్రకటన జారీ చేశారు. ట్రూడో పదవి నుంచి దిగిపోవలని సొంతపార్టీ నేతల నుంచే గత కొంతకాలంగా డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రూడో.. ప్రధాని పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. అయితే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఈ పదవులకు రాజీనామా చేస్తానని ట్రూడో పేర్కొన్నారు. 

Tags:    

Similar News