Jpc: జమిలీ ఎన్నికలు.. రేపే జేపీసీ తొలి సమావేశం !

వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జేపీసీ తొలి సమావేశం బుధవారం జరగనుంది.

Update: 2025-01-07 18:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One nation one election) ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తొలి సమావేశం బుధవారం జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రతిపాదిత చట్టాల నిబంధనలను జేపీసీ సభ్యులకు న్యాయ మంత్రిత్వ శాఖ వివరించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేగాక పలువురి అభిప్రాయాలను కూడా తీసుకోనున్నట్టు సమాచారం. జేపీసీ తన నివేదికను వచ్చే పార్లమెంట్ సెషన్‌లో మొదటి వారం చివరి రోజున లోక్‌సభలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై చర్చ చేపట్టేందుకు చర్యలు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. అయితే ప్రతిపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ బిల్లుపై మరింత కసరత్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీసీకి పంపించింది. 39 మంది సభ్యులతో కూడిన కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్‌కు నుంచి ప్రియాంక గాంధీ, జేడీయూకి చెందిన సంజయ్ ఝా, శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌తో పాటు తదితరులు సభ్యులుగా ఉన్నారు.

Tags:    

Similar News