షాకింగ్ ఘటన.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి
మేనకోడలు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుందని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.
దిశ,వెబ్‌డెస్క్: మేనకోడలు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుందని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో వివాహ రిసెప్షన్ వేడుకలో దుశ్చర్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఉట్రే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అతిథుల కోసం ఏర్పాటు చేసిన విందు భోజనంలో విషం కలిపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ఇంట్లోనే పెరిగిన మేనకోడలు మరో వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో ఆమె పై కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుందని వింధు భోజనంలో ఆ వ్యక్తి విషం కలిపాడు. ఈ ఘటన పై స్థానికులు పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటినా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే నిందితుడు పారిపోయినట్లు సమాచారం. ఆ ఆహార పదార్థాలు ఎవరూ తినకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఆహార పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
Read More ...
‘మహిళల శరీరాకృతిపై కామెంట్స్ కూడా లైంగిక వేధింపులే’.. హైకోర్టు సంచలన తీర్పు