English-India: ఇంగ్లీష్ మాట్లాడటంలో భారత్ టాప్.. గ్లోబల్ యావరేజ్ కంటే బెటర్ ర్యాంక్
వివిధ దేశాల్లో 7.5 లక్షల స్కిల్ టెస్టుల ద్వారా నిర్వహించిన ఈ అధ్యయనాన్ని పియర్సన్ సంస్థ సోమవారం విడుదల చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఇంగ్లీష్ భాషను సరిగా మాట్లాడే విషయంలో మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ టాప్‌లో ఉందని ఓ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 7.5 లక్షల స్కిల్ టెస్టుల ద్వారా నిర్వహించిన ఈ అధ్యయనాన్ని పియర్సన్ సంస్థ సోమవారం విడుదల చేసింది. ది పియర్సన్ గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ రిపోర్ట్ 2024 పేరుతో తీసుకొచ్చిన ఈ నివేదిక ప్రకారం, భారత్‌తో పాటు జపాన్, ఈజిప్ట్, కొలంబియా, ఫిలిప్పీన్స్, యూరప్ దేశాల ప్రజల ఇంగ్లీష్ భాషా నైపుణ్యం గురించి విశ్లేషించింది. అలాగే, ఇంగీష్ మాట్లాడటంలో గ్లోబల్ యావరేజ్ స్కోర్ 54 ఉండగా, భారత్ స్కోర్ 57 ఉండటం విశేషం. అలాగే, ఇంగ్లీష్ రైటింగ్ స్కోర్ భారత్, గ్లోబల్ యావరేజ్ సమానంగా 61 మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్ స్కిల్స్ స్కోర్ మాత్రం గ్లోబల్ యావరేజ్ 57 కంటే భారత్ 52 మార్కులతో కొంత తక్కువగా ఉంది. ఇక, దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే విషయంలో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఢిల్లీలోని ప్రజలు ఇంగ్లీష్‌ను సక్రమంగా మాట్లాడుతున్నారు. దీని తర్వాత రాజస్థాన్(60), పంజాబ్(58) ఉన్నాయి.