Jai Bapu: జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్.. దేశ వ్యాప్తంగా ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రచారం ప్రారంభించింది. సీనియర్ నేత పవన్ ఖేరా ఈ విషయాన్ని వెల్లడించారు.

Update: 2025-01-04 18:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ (Ambedkar) పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జై బాపు (Jai bapu), జై భీమ్ (Jai bhim), జై సంవిధాన్ (jai samvidhan) ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Pavan khera) ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో చౌపల్ ఏర్పాటు చేసి అంబేద్కర్‌ను అవమానిస్తూ, రాజ్యాంగాన్ని కించపరిచేలా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏవిధంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ ప్రచారం జవనరి 26న అంబేడ్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో భారీ ర్యాలీతో ముగుస్తుందని తెలిపారు. అంబేడ్కర్‌పై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు గాను హోం మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నామన్నారు. కాగా, డిసెంబర్ 27 నుంచి ఈ ప్రచారం ప్రారంభం కావాల్సి ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో రద్దు చేశారు.

Tags:    

Similar News