President Draupadi Murmu : రైతు సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వని రాష్ట్రపతి

రైతు సంఘాల నాయకులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) అపాయింట్మెంట్ నిరాకరించారు.

Update: 2025-01-06 14:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : రైతు సంఘాల నాయకులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) అపాయింట్మెంట్ నిరాకరించారు. తమ సమస్యలు విన్నవించడానికి పలు రైతు సంఘాల నాయకులు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరగా.. సమయం లేకపోవడం వల్ల కలవడం వీలుకాదని వారికి రాష్ట్రపతి కార్యాలయం నుంచి సందేశం అందింది. పంటలకు సరైన ధరలు లేకపోవడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం, రైతుల పంట అప్పులు పెరగడం వంటి సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు కిసాన్ మోర్చా(Kisan Morcha) రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరగా.. సమయం లేదంటూ వచ్చిన సందేశంతో వారు నిరాశకు గురయ్యారు.  

Tags:    

Similar News