Nimisha Priya : కేరళ నర్సుకు యెమన్‌లో మరణశిక్ష.. ఆదుకుంటామన్న ఆ దేశం

దిశ, నేషనల్ బ్యూరో : కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ(Nimisha Priya)కు మరో నెల రోజుల్లో యెమన్‌(Yemen) దేశంలో మరణశిక్ష అమలు కానుంది.

Update: 2025-01-02 10:51 GMT
Nimisha Priya : కేరళ నర్సుకు యెమన్‌లో మరణశిక్ష.. ఆదుకుంటామన్న ఆ దేశం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ(Nimisha Priya)కు మరో నెల రోజుల్లో యెమన్‌(Yemen) దేశంలో మరణశిక్ష అమలు కానుంది. ఈ తరుణంలో ఆమెకు ఆపన్న హస్తం అందించేందుకు ఇరాన్ రంగంలోకి దిగింది. మానవతా కోణంలో నిమిషా ప్రియకు ఆపన్న హస్తం అందిస్తానని యెమన్‌లోని ఇరాన్(Iran) రాయబార కార్యాలయం ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. మానవతా కోణంలో తాను చేయగలిగినదంతా చేస్తానని ఆయన వెల్లడించారు. యెమన్ దేశంతో ఇరాన్‌కు సన్నిహిత దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ఉన్నతాధికారి ప్రయత్నాలు సఫలమైతే నిమిషా ప్రియకు మరణశిక్ష గండం తప్పుతుంది.

ఏమిటీ కేసు ?

నిమిషా ప్రియ కేరళ(Kerala Nurse)లోని పాలక్కడ్ జిల్లా వాస్తవ్యురాలు. ఆమె ఉపాధి కోసం 2008లో యెమన్‌కు వెళ్లింది. కొన్నాళ్ల పాటు యెమన్‌లోని కొన్ని ఆస్పత్రుల్లో నిమిష పనిచేసింది. 2015లో తన సొంత క్లినిక్‌‌ను ప్రారంభించింది. ఈక్రమంలో వ్యాపార భాగస్వామిగా యెమన్ జాతీయుడు తలాల్ అబ్దో మెహదీని నిమిష ఎంచుకుంది. ఇతర దేశాల వారు యెమన్‌లో వ్యాపారం చేయాలంటే.. ఎవరైనా ఒక యెమన్ జాతీయుడిని వ్యాపార భాగస్వామిగా చేసుకోవాలనే రూల్ ఉంది. అందుకే నిమిష తన క్లినిక్‌లో వ్యాపార భాగస్వామిగా తలాల్ అబ్దో మెహదీని చేసుకుంది. 2017 జులైలో క్లినిక్ లావాదేవీల విషయంలో నిమిషా ప్రియ, తలాల్ అబ్దో మెహదీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో నిమిష చేసిన దాడిలో తలాల్ అబ్దో మెహదీ చనిపోయాడు. అప్పటి నుంచి నిమిషా ప్రియ యెమన్ జైలులోనే ఉంది. యెమన్ జాతీయుడిని హత్య చేసినందుకు ఆమెకు మరణశిక్షను విధించే ప్రతిపాదనను యెమన్ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఇటీవలే ఆమోదం తెలిపారు. చనిపోయిన యెమన్ జాతీయుడి కుటుంబీకులు క్షమిస్తున్నామని ప్రకటిస్తే తప్ప ఈ శిక్ష అమలు ఆగే అవకాశం లేదు.

Tags:    

Similar News