TIcket: టికెట్ కౌంటర్‌లో కొన్నా ఆన్ లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు. వీరిలో ఎక్కువ మంది ఎక్కువ మంది టిక్కెట్లు బుక్ చేసుకుంటారు.

Update: 2025-03-29 18:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు. వీరిలో ఎక్కువ మంది ఎక్కువ మంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్, ఇతర యాప్‌ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. కానీ అనేక మంది ప్రయాణీకులు రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టిక్కెట్లు కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్స్ తమ టికెట్‌ను కౌంటర్‌లో కొన్నా దానిని ఆన్ లైన్‌లో క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini vaishnaw) తెలిపారు. టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణీకుడు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్, 139 ద్వారా ఆన్‌లైన్‌లో రద్దు చేసుకోవచ్చని వెల్లడించారు. అయితే రీఫండ్ కోసం మాత్రం రిజర్వేషన్ కేంద్రాలను సందర్శించాలని చెప్పారు.

ప్రయాణీకులు బుకింగ్ కౌంటర్‌లో అసలు టికెట్‌ను చూపించాలని తెలిపారు. ఈ చొరవ టికెట్ రద్దు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, ప్రయాణీకులకు ఇబ్బందిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. తాజాగా ఆయన రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రైల్వే ప్యాజింజర్ రూల్స్ 2015 ప్రకారం నిర్దేశించిన సమయ పరిమితి ప్రకారం కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌ను కౌంటర్‌లో తిరిగి ఇస్తే దానిని రద్దు చేస్తామన్నారు.

Tags:    

Similar News