Sukhbir Badal: ఎస్ఏడీ చీఫ్‌గా మరోసారి సుఖ్ బీర్ బాదల్.. పార్టీ సమావేశంలో నిర్ణయం

శిరోమణి అకాలీదళ్ (SAD) అధ్యక్షుడిగా మరోసారి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఎన్నికయ్యారు.

Update: 2025-04-12 14:44 GMT
Sukhbir Badal: ఎస్ఏడీ చీఫ్‌గా మరోసారి సుఖ్ బీర్ బాదల్.. పార్టీ సమావేశంలో నిర్ణయం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: శిరోమణి అకాలీదళ్ (SAD) అధ్యక్షుడిగా మరోసారి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal) ఎన్నికయ్యారు. పంజాబ్‌లోని అమృత్ సర్‌ (Amrith sar) లో శనివారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్వీందర్ సింగ్ భుందార్ బాదల్ (Bundhar badal) పేరును ప్రతిపాదించగా పార్టీ సీనియర్ నేత పరమ్‌జిత్ సింగ్ సర్నా దానిని బలపరిచారు. బాదల్‌కు వ్యతిరేకంగా ఎవరూ అభ్యంతరం తెలపకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా పార్టీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. కాగా, సుఖ్ బీర్ బాదల్ 2008లో తొలిసారిగా పార్టీ అధ్యక్షుడయ్యాడు. అప్పటి నుంచి ఆయన ఇదే పదవిలో కొనసాగారు.

అయితే ఓ కేసులో భాగంగా బాదల్ నేరస్థుడిగా తేలిన తర్వాత అఖాల్ తఖ్త్ ఆయనకు మతపరమైన శిక్ష విధించింది. దీంతో ఆయన గతేడాది నవంబర్ 16న పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్వర్ణ దేవాలయంలో శిక్ష అనుభవిస్తున్న టైంలో ఆయనపై పలువురు కాల్పులు జరపగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి పార్టీ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం గమనార్హం.

Tags:    

Similar News