Nagendran: తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నైనార్ నాగేంద్రన్.. ప్రకటించిన అధిష్టానం
తమిళనాడు బీజేపీ చీఫ్ గా నైనార్ నాగేంద్రన్ నిమాయకమయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం శనివారం అధికారికంగా ప్రకటించింది.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు బీజేపీ చీఫ్ గా నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) నిమాయకమయ్యారు. ఈ మేరకు కాషాయ పార్టీ అధిష్టానం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ పదవికి రాష్ట్రంలోని సీనియర్ నేతలు నాగేంద్రన్ పేరును ప్రతిపాదించగా ఆయన ఇటీవలే నామినేషన్ వేశారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాగేంద్రన్‌కు మాజీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) అభినందనలు తెలిపారు. నాగేంద్రన్ నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ మరింత బలపడుతుందని దీమా వ్యక్తం చేశారు.
2026లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)ను గద్దె దించుతామని చెప్పారు. ఏఐఏడీఎంకేతో కలిసి ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని తెలిపారు. కాగా, కన్యాకుమారి జిల్లాలోని వడివీశ్వరంలో జన్మించిన నైనార్ నాగేంద్రన్‌కు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గతంలో ఏఐఏడీఎంకే నేతగా ఉన్న నాగేంద్రన్ జయలలిత మరణాంతరం 2017లో బీజేపీలో చేరారు. తిరునల్వేలి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.