నాలుకతో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన భారత యువకుడు
ప్రపంచంలో ఎవరు చేయలేని పనిని తక్కువ సమయంలో చేసిన వ్యక్తులకు, క్రీడాకారులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లను అందిస్తారు.
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో ఎవరు చేయలేని పనిని తక్కువ సమయంలో చేసిన వ్యక్తులకు, క్రీడాకారులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్(Guinness Book of Records)లను అందిస్తారు. ఈ క్రమంలో భారత్‌కు చెందిన క్రాంతి డ్రిల్‌మాన్(Kranti Drillman) అనే వ్యక్తి ఏకంగా తన నాలుకతో 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను ఆపేసాడు. దీంతో అతను ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. కాగా ఈ రికార్డుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ రికార్డు.. ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియోలు క్రాంతి డ్రిల్‌మాన్.. అత్యంత వేగంగా తిరుగుతున్న ఎలక్ట్రికల్ ఫ్యాన్ బ్లేడ్ల(Electrical fan blades)ను తన నాలుకతో ఆపడం కనిపించింది. అలాగే కొన్ని ఫ్యాన్లను ఆపిన తర్వాత అతని నాలుకకు గాయమై రక్తం కారినప్పటికి అతను ఆగకుండా అలాగే ముందుకు సాగాడు. ఈ క్రమంలోనే అతను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ (Guinness Book World Record)ను సాధించాడు. దీంతో అతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ సర్టిఫికేట్(Certificate)ను అందించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఈ ఘనత సాధించేందుకు ఏళ్ల తరబడి కష్టపడి సాధన చేశానని క్రాంతి తెలిపారు.