Madras High Court : అన్నా యూనివర్సిటీ రేప్ కేసు.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో మనమంతా సహ నిందితులమే అని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2025-01-02 12:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో మనమంతా సహ నిందితులమే అని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై ధర్నా చేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారని పీఎంకే(పక్కలి మక్కల్ కట్చి) పార్టీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పీ.వేల్‌మురుగన్ ఈ మేరకు స్పందించారు. ‘కులం, లింగం ఆధారంగా వివక్ష కొనసాగుతున్న ఈ జెనరేషన్‌లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. మనమంతా సిగ్గుపడాలి. ఈ నేరంలో మనమంతా సహ నిందితులమే. మీడియా అటెన్షన్ కోసమే పొలిటికల్ పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. ఇందులో బాధితురాలికి న్యాయం చేయాలనే తపన కనిపించడం లేదు. మీడియా సైతం బాధ్యతయుతంగగా వ్యవహరించాలి. సమస్యను రిపోర్ట్ చేయడాన్ని తాను తప్పుబట్టడం లేదు. కానీ కొన్ని విషయాల్లో మీడియా అనుసరిస్తున్న పద్ధతి సరికాదు.భద్రత అనే పదమే తప్పు. సమాజంలో మహిళలకు సమాన హక్కులు ఇవ్వడం లేదని స్పష్టం అవుతోంది. ఈ ధోరణి తప్పకుండా మారాల్సిందే.. ’ అని వేల్ మురుగన్ అన్నారు.


Tags:    

Similar News