Khushboo : అన్నా యూనివర్సిటీ ఘటనలో ప్రభుత్వ వైఖరీ ఆక్షేపణీయం : బీజేపీ నాయకురాలు కుష్బూ
తమిళనాడు(Tamil Nadu) అన్నా యూనివర్సిటీ(Anna University) లో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన(Incident) పట్ల రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వ ఉదాసీనత వైఖరీ ఆక్షేపణీయమ(Objectionable)ని బీజేపీ నాయకురాలు(BJP Leader), నటి కుష్బూ(Khushboo) విమర్శించారు.
దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు(Tamil Nadu) అన్నా యూనివర్సిటీ(Anna University) లో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన(Incident) పట్ల రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వ ఉదాసీనత వైఖరీ ఆక్షేపణీయమ(Objectionable)ని బీజేపీ నాయకురాలు(BJP Leader), నటి కుష్బూ(Khushboo) విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం(State Government) పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసుపై సీఎం, డిప్యూటీ సీఎం, డీఎంకే మహిళా నాయకుల నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. దాడి ఘటన పట్ల ప్రభుత్వం వైపు నుంచి జవాబుదారి తనం లోపించిందన్నారు.
ప్రజలు త్వరగా అన్ని విషయాలు మరిచిపోతారని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉందని, కాని వారు అన్ని గుర్తు పెట్టుకుని ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు కేవలం ఆ ఒక్క ఘటనపైనే కాకుండా రాష్ట్రంలో మహిళలు, బాలికల పట్ల జరుగుతున్న దాడులకు నిరసనగా చేస్తున్నావని స్పష్టం చేశారు. డీఎంకే పాలనలో రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు.