ISRO : శాటిలైట్‌తో స్మార్ట్‌ఫోన్ లింక్.. అమెరికా శాటిలైట్‌ను ప్రయోగించనున్న ఇస్రో
దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో అమెరికాకు చెందిన ఓ కీలకమైన కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఇస్రో(ISRO) ప్రయోగించబోతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో అమెరికాకు చెందిన ఓ కీలకమైన కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఇస్రో(ISRO) ప్రయోగించబోతోంది. ఆ ప్రయోగం సక్సెస్ అయితే స్మార్ట్‌ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచి శాటిలైట్ కనెక్టివిటీ లభిస్తుంది. శాటిలైట్ నుంచి అందే సిగ్నల్స్‌ను వాడుకొని స్మార్ట్ ఫోన్ల యూజర్లు వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈవివరాలను కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘ఏఎస్‌టీ స్పేస్ మొబైల్’ కంపెనీకి చెందిన ‘బ్లాక్ 2 బ్లూ బర్డ్’ శాటిలైట్(US satellite)ను ఇస్రో ప్రయోగించనుందని ఆయన వెల్లడించారు.
ఈ ప్రయోగం కోసం ఇస్రో అనుబంధ విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్)తో ‘ఏఎస్‌టీ స్పేస్ మొబైల్’ కంపెనీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ‘బ్లాక్ 2 బ్లూబర్డ్’ శాటిలైట్ 5 జీ బ్రాడ్‌బ్యాండ్ సిగ్నల్స్‌ను అందించేందుకు వీలుగా దాన్ని భూమి దిగువ కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహానికి దాదాపు 64 చదరపు మీటర్ల సైజులో భారీ యాంటెనా ఉంది. దాని బరువు దాదాపు 6వేల కేజీలు. ఈ ప్రయోగం కోసం ఇస్రో తన బాహుబలి రాకెట్ జీఎస్‌ఎల్‌వీని ఉపయోగించనుంది. ప్రయోగం విజయవంతం అయ్యాక.. బ్లాక్ 2 బ్లూబర్డ్ శాటిలైట్‌లోని టెక్నాలజీని వాడుకొని అమెరికాలో శాటిలైట్ ఆధారిత ఫోన్ కాల్స్ సర్వీసులను ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ కంపెనీ ప్రారంభించనుంది. తదుపరి విడతగా ఈ సేవలను ఇతర దేశాలకూ విస్తరించే అవకాశాలు లేకపోలేదు.
Read More ....
Elon Musk : ట్రంప్ హోటల్ ఎదుట టెస్లా కారులో పేలుడు.. మస్క్ రియాక్షన్ ఇదీ