మేధా పాట్కర్‌కు షాక్..పరువు నష్టం కేసులో 5 నెలల జైలు శిక్ష

సామాజిక కార్యకర్త, ‘నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దాఖలు చేసిన క్రిమినల్ పరువు

Update: 2024-07-01 12:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సామాజిక కార్యకర్త, ‘నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆమెకు ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఐదు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేగాక సక్సేనా పరువుకు నష్టం కలిగించిన కారణంగా ఆయనకు రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. అయితే ఈ ఉత్తర్వుపై అప్పీల్ చేసుకోవడానికి పాట్కర్‌కు ఒక నెల రోజుల సమయం ఇచ్చింది. అప్పటి వరకు జైలు శిక్ష అమలును నిలిపి వేసింది.

కాగా, ప్రస్తుత ఢిల్లీ ఎల్జీ సక్సేనా.. అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్‌ చీఫ్‌గా పని చేస్తున్న టైంలో 2000 సంవత్సరంలో మేధా పాట్కర్ పై పరువు నష్టం కేసు వేశారు. అప్పటి నుంచి దీనిపై విచారణలు జరగగా.. గత నెల 25న న్యాయస్థానం మేధా పాట్కర్‌ను దోషిగా తేల్చింది. అప్పుడు తీర్పును వాయిదా వేసిన కోర్టు తాజాగా వెల్లడించింది. కోర్టు ఆదేశాలపై మేధా పాట్కర్ స్పందించారు. ‘సత్యాన్ని ఎప్పటికీ ఓడించలేరు. మేము ఎవరినీ కించపరచడానికి ప్రయత్నించలేదు. మా పని మాత్రమే చేశాం. కోర్టు తీర్పును సవాల్ చేస్తాం’ అని తెలిపారు. 


Similar News