సీబీఐ కేసులో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్

బుధవారం బెయిల్ పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరుతూ ఏసీజే మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు.

Update: 2024-07-03 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మద్యం పాలసీ కుంభకోణం కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం బెయిల్ పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరుతూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్‌ను గురువారం విచారణకు స్వీకరించాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోర్టును కోరగా, పరిశీలించిన అనంతరం శుక్రవారం విచారిస్తామని ఏసీజే స్పష్టం చేశారు. అంతకుముందు మంగళవారం సీబీఐ అరెస్ట్‌ను సవాలు చెస్తూ ఢిల్లీ సీఎం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై జూలై 17లోగా స్పందించాలని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. జూన్ 26న లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసి రూస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన సంగతి తెలిసిందే. అనంతరం విచారణ కోసం మూడు రోజుల కస్టడీకి పంపారు. గతవారం తీహార్ జైల్లో విచారణ అనంతరం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు సీబీఐకి అనుమతి లభించింది.

జూలై 12 వరకు కస్టడీ పొడిగింపు..

మరోవైపు, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు కష్టాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి జ్యూడీషియల్ కస్టడీనికి జూలై 12 వరకు పొడిగిస్తూ రూస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. మెడికల్ బోర్డుతో కన్సల్టేషన్ సమయంలో తన భార్యను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతివ్వాలని ఆప్ కన్వీనర్ డిమాండ్‌పై కోర్టు తన నిర్ణయాన్ని జూలై 6కు వాయిదా వేసింది. 

Tags:    

Similar News