నైటీ మాత్రమే వేసుకోవాలని భర్త వేధింపులు.. భార్య ఏం చేసిందంటే?

ఆడవాళ్లు, మగవాళ్లు, చిన్నా, పెద్దా.. ఎవరైనా సరే వారికి సౌకర్యవంతమైన బట్టలను ధరిస్తారు.

Update: 2025-03-23 08:23 GMT
నైటీ మాత్రమే వేసుకోవాలని భర్త వేధింపులు.. భార్య ఏం చేసిందంటే?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఆడవాళ్లు, మగవాళ్లు, చిన్నా, పెద్దా.. ఎవరైనా సరే వారికి సౌకర్యవంతమైన బట్టలను ధరిస్తారు. ఎవరికి నచ్చింది వాళ్లు కట్టుకోవడంలో తప్పేలేదు. పైగా ఎదుటి వాళ్లకి నచ్చాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది ఒకరు ధరించే బట్టల విషయంలో మరొకరి జోక్యం ఉంటే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తాజాగా ఇదే విషయంలో భార్యపై ఓ భర్త అతడి తల్లిదండ్రులతో కలిసి తీవ్రంగా వేధించాడు. తను చెప్పినట్లుగా బట్టలు వేసుకోవటం లేదని హింసించాడు. గుజరాత్ రాష్ట్రంలో (Gujarath) వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

అహ్మాదాబాబ్‌లోని (Ahmedabad) జుహాపురాకు చెందిన 21 ఏళ్ల మహిళ తన భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ వేజల్పూర్ పోలీసులను ఆశ్రయించింది. తనని ఇంట్లో ఎప్పుడూ నైటీ ధరించాలని బలవంతం చేస్తున్నారని, వారు చెప్పినట్లుగా నైటీ వేసుకోకపోతే వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. మే 2023లో సౌదీ అరేబియాలో తనకు పెళ్లి జరిగిందని తెలిపింది. వివాహం జరిగినప్పటి నుంచి తను ధరించే దుస్తువులపై ఆంక్షలు విధిస్తున్నారని, అలాగే మద్యానికి అలవాటు పడిన తన భర్త తాను ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు మేల్కొవాలి? తదితర విషయాలపై నియమాలు పెట్టి హింసించేవాడని చెప్పింది. తను ప్రతిఘటిస్తే వారంతా తనను అసభ్యకరంగా తిట్టేవారని పేర్కొంది. గత ఏడాది మే నెలలో కుటుంబం అంతా కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లినట్లు తెలిపిన ఆమె.. అప్పటి నుంచి తన పరిస్థితి మరింత దారుణంగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత భర్త ఇంటిని వదిలేసి వచ్చి తన తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో తెలిపింది.  

Tags:    

Similar News