తల్వార్తో బెదిరించిన వ్యక్తిపై కేసు
తల్వార్ తో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు.

దిశ, ఆదిలాబాద్ : తల్వార్ తో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. మంగళ వారం ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారిగూడ కు సంబంధించిన సలీం ఖాన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో తల్వార్లతో ఒక పోస్టును పెట్టాడని వెల్లడించారు.
ఇదివరకే సలీం ఖాన్ అనే వ్యక్తి పలు ముఖ్యమైన కేసులలో నిందితుడిగా ఉన్నట్టు చెప్పారు. ఎవరైనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వీడియో లు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా కత్తులతో కానీ తల్వార్లతో కానీ, బొమ్మ తుపాకులతో కానీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఎలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు.