హథ్రాస్ తొక్కిసలాట ఘటనపై స్పందించిన పుతిన్.. ముర్ము, మోడీకి కీలక సందేశం..!

ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ తొక్కిసలాట ఘటనపై రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు

Update: 2024-07-03 13:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ తొక్కిసలాట ఘటనపై రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు పుతిన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు పుతిన్ సంతాప సందేశాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీకి బుధవారం పంపారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ జిల్లాలో ఓ మతపరమైన కార్యక్రమంలో మంగళవారం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 121 మంది చనిపోగా.. దాదాపు 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. తొక్కిసలాటలో 121 మంది మరణించడం దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై ఉత్తర‌ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News