Iskcon: చిన్మయి కృష్ణదాస్ గురించి ఇస్కాన్ కీలక ప్రకటన

ఇస్కాన్‌ (ISKCON)కు చెందిన చిన్మయి కృష్ణదాస్‌ (Chinmoy Krishnadas) విషయంలో వస్తున్న వార్తలను ఆధ్యాత్మిక సంస్థ ఖండించింది.

Update: 2024-11-29 10:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇస్కాన్‌ (ISKCON)కు చెందిన చిన్మయి కృష్ణదాస్‌ (Chinmoy Krishnadas) విషయంలో వస్తున్న వార్తలను ఆధ్యాత్మిక సంస్థ ఖండించింది. బంగ్లాదేశ్‌ (Bangladesh)లో చిన్మయి అరెస్టు అయ్యారు. కాగా.. బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌ ఆయనకు దూరంగా ఉందని వస్తున్న వార్తలు అసత్యమని ఆధ్మాత్మిక సంస్థ వెల్లడించింది. చిన్మయి కృష్ణదాస్‌కు ఎప్పటిలాగానే తాము అండగా ఉంటామని పేర్కొంది. దేశంలోని హిందువుల హక్కులను పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపింది. ‘‘హిందువులను, వారి ప్రార్థనా స్థలాలను రక్షించాలని శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్మయి కృష్ణదాస్‌కు ఇస్కాన్‌ మద్దతు ఎప్పటికీ ఉంటుంది. మాది శాంతి, ప్రేమతో కూడిన భక్తి ఉద్యమం. కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని ఇస్కాన్‌ పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు అసత్య, హానికరమైన ప్రచారాలు చేస్తున్నారు. వీటి వల్ల సమాజంలో మా సంస్థను అప్రతిష్ఠపాలు చేయడమే కాకుండా, అశాంతిని సృష్టించేందుకు యత్నిస్తున్నట్లుంది’’ అని ఇస్కాన్ ప్రధాన కార్యదర్శి చారు చంద్రదాస్‌ అన్నారు.

చిన్మయిని తొలగిస్తున్నట్లు వార్తలు

ఇకపోతే, చిన్మయి కృష్ణదాస్‌ ప్రవర్తన కారణంగా ఇస్కాన్‌లోని అన్ని కార్యకలాపాల నుంచి అతడిని తొలగించామని చారు చంద్రదాస్ పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. చిన్మయి కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలతో, నిరసన కార్యక్రమాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఆయన చేపట్టిన నిరసన కార్యకలాపాల్లో ఇస్కాన్‌ ప్రమేయం లేదని బంగ్లాదేశ్‌ మీడియా వర్గాలు పేర్కొన్న తర్వాతే ఈ వార్తలు వచ్చాయి. దీనిపైనే ఇస్కాన్ క్లారిటీ ఇచ్చింది. మరోవైపు, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింసకు నిరసనగా గత నెలలో చిట్టగాంగ్‌లో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో చిన్మయి కృష్ణదాస్ బంగ్లా జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News