Trump-Putin: ఆయనో ఇంటెలిజెంట్ పాలిటీషియన్.. ట్రంప్ పై పుతిన్ ప్రశంసలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ప్రశంసలు కురిపించారు.

Update: 2024-11-29 04:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ప్రశంసలు కురిపించారు. కజకిస్థాన్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న రష్యా అధినేత మీడియాతో మాట్లాడారు. ఆయనో ఇంటెలిజెంట్ పాలిటీషియన్ అని.. అయితే, ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదన్నారు. అయితే, ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయని తెలిపారు. అమెరికా ఎన్నికల (US Elections) ప్రచారంలో జరిగిన ఘటనలను గుర్తుచేసుకున్నారు. ‘‘అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర పరిస్థితులు తలెత్తాయి. ఎన్నికల్లో ట్రంప్‌పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారు. ఆయన కుటుంబాన్నిలక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం బాధాకరం. ఒకటికంటే ఎక్కువసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరగడం విచారకరం. నా ఆలోచన ప్రకారం.. ఇప్పుడు ట్రంప్‌ (Trump) ఏమాత్రం సురక్షితంగా లేరు. అయితే ఆయనో ఇంటలిజెంట్ వ్యక్తి. ముప్పును అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నా’’ అని పుతిన్‌ (Putin) తెలిపారు.

ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతలు

ఇక, ఇటీవల దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇచ్చిన అనుమతులపై పుతిన్‌ తీవ్రంగా స్పందించారు. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచే నిర్ణయమని మండిపడ్డారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక దీనికి పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. చర్చలకు మాస్కో రెడీగా ఉందన్నారు. ఇకపోతే, ఉక్రెయిన్‌ (Ukraine)కు తాము అందిస్తున్న ఆర్మీ టాక్టికల్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు బైడెన్‌ ఇటీవల ప్రకటించారు. దీనిని క్రెమ్లిన్ ఖండించింది. తమ దేశం పైకి క్షిపణులు వస్తే ప్రతిస్పందన ఘాటుగా ఉంటుందని హెచ్చరించారు. అందుకు తగ్గట్లే కీవ్‌పై రష్యా సేనలు దూకుడు పెంచాయి. క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.

Tags:    

Similar News