బీజేపీకి షాకిచ్చిన బీజేడీ..ప్రతిపక్షంతో కలిసి వాకౌట్

ఒడిశాలో నవీన్ పట్నాయ్ నేతత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీలు గత కొన్నేళ్లుగా మిత్రపక్షాలుగా ఉన్నాయి. మోడీ 2.0 ప్రభుత్వంలో రాజ్యసభలో కొన్నీ బిల్లులను క్లియర్ చేసేందుకు అనేక సార్లు బీజేడీ కాషాయ పార్టీకి సహాయపడింది.

Update: 2024-07-03 13:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో నవీన్ పట్నాయ్ నేతత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీలు గత కొన్నేళ్లుగా మిత్రపక్షాలుగా ఉన్నాయి. మోడీ 2.0 ప్రభుత్వంలో రాజ్యసభలో కొన్నీ బిల్లులను క్లియర్ చేసేందుకు అనేక సార్లు బీజేడీ కాషాయ పార్టీకి సహాయపడింది. అయితే ఒడిశా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి బీజేడీ బీజేపీకి దూరంగా ఉంటున్నది. అయితే బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇస్తున్న సమయంలో విపక్ష సభ్యులు వాకౌట్ చేశాయి. ఈ టైంలో బీజేడీకి చెందిన ఎంపీలు సైతం వాకౌట్‌లో చేరారు. దీంతో గత ఏడాది కాలంగా రాజ్యసభలో వివాదాస్పద బిల్లులపై బీజేపీకి మద్దతు ఇచ్చిన పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్షంతో చేతులు కలపడంతో బీజేపీకి షాక్ తగిలినట్టు అయింది. కాగా, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీపై ప్రధాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతిపక్షాలు రాజ్యసభలో వాకౌట్ చేశాయి.


Similar News