PM Internship Scheme: ప్రధాన మంత్రి ఇంటర్న్​షిప్​ స్కీమ్..ఎలా దరఖాస్తు చేయాలి..? అర్హులు ఎవరు..?

దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి,నైపుణ్య అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని (PM Internship Scheme) ప్రారంభించిన విషయం తెలిసిందే.

Update: 2024-10-08 14:15 GMT

దిశ, వెబ్‌డెస్క్:దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి,నైపుణ్య అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని (PM Internship Scheme) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కోసం కేంద్రం బడ్జెట్ లో 800 కోట్లు కేటాయించింది. ఈ పథకాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి(Union Finance Minister) నిర్మల సీతారామన్(Nirmala Sitharaman) జూలై 23న బడ్జెట్ సమావేశాలలో ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 12 నుంచి 25 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఈ పథకం కోసం కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. ఈ స్కీమ్​కు ఎంపికైన అభ్యర్థులకు దేశంలోని టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్​షిప్ అవకాశాలను కల్పిస్తారు. వన్ టైమ్ గ్రాంట్ కింద రూ. 6,000.. ఇంకా ప్రతి నెల రూ.5,000 స్టైఫండ్ కూడా చెల్లిస్తారు.

ఇంటర్న్‌షిప్‌ పథకానికి అర్హులు ఎవరు..?

ఈ స్కీమ్​కు అప్లై చేసుకునే వారు భారత పౌరుడై ఉండాలి. అభ్యర్థులు SSC, HSC, ఐటీఐ, పాలిటెక్నిక్​ లేదా B.Sc, B.Com, BCA, BBA లేదా బీఫార్మసీ వంటి గ్రాడ్యుయేషన్​ డిగ్రీలు పూర్తి చేసి ఉండాలి. వయస్సు 21-24 ఏళ్ల మధ్య ఉండాలి. వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఆన్లైన్ దూర విద్య ద్వారా చదువుతున్న యువత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి..?

అభ్యర్థులు ఆన్‌లైన్ పోర్టల్ https://pminternship.mca.gov.in/login/లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 25 వరకు అప్లై చేయాలి. కంపెనీలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేసి ఎంపిక చేస్తాయి. ఈ స్కీమ్​కు ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 2 నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభమై 12 నెలల పాటు ఉంటుంది.  


Similar News