Supreme Court : మ్యారేజ్ రిలేషన్ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది : సుప్రీంకోర్ట్

మ్యారేజ్ రిలేషన్(Marriage Relation) మీద సుప్రీంకోర్ట్(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2024-12-21 14:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : మ్యారేజ్ రిలేషన్(Marriage Relation) మీద సుప్రీంకోర్ట్(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ బంధం పరస్పర నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే.. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జంట దాదాపు 20 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఇదివరకే వీరిద్దరికీ మద్రాసు హైకోర్ట్(Madras High Court) మధురై బెంచ్ విడాకులు మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్.. పెళ్లి బంధం అనేది పరస్పర నమ్మకం, విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని.. ఈ కేసులో దంపతుల ఇవేమీ లేవని, ఇద్దరి మధ్య విరోధాలు కనిపిస్తున్నందున వీరి బంధాన్ని నిలబెట్టలేమని, కేసు కొట్టి వేసింది ధర్మాసనం. 

Tags:    

Similar News