Building Collapse : కుప్పకూలిన మూడంతస్తుల భవనం

మూడంతస్తుల భవనం కుప్పకూలి(building collapse), ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు.

Update: 2024-12-21 16:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : మూడంతస్తుల భవనం కుప్పకూలి(building collapse), ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఫైర్‌, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. పంజాబ్‌(Punjab)లోని మొహాలీలో ఈ సంఘటన జరిగింది. బేస్‌మెంట్‌ కోసం తవ్వకం పనులు జరుగుతుండగా పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ బిల్డింగ్‌లో జిమ్‌ నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో భవనం శిథిలాల కింద పది మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్‌, రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. రెస్క్యూ పనులు చేపట్టారు. జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని నివాసితులు భయాందోళన చెందారు.


Similar News