Priyank karge: అమిత్ షాను పిచ్చి కుక్క కరిచింది: కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు.

Update: 2024-12-21 18:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith shah)పై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank karge) తీవ్రంగా మండిపడ్డారు. అమిత్ షాను పిచ్చి కుక్క కరిచిందని, అందుకే అంబేడ్కర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం ఆయన కలబుర్గిలో మీడియాతో మాట్లాడారు. ‘ఏడు జన్మలలో భగవంతుని నామాన్ని జపిస్తే స్వర్గంలో స్థానం లభిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ జన్మలో అంబేడ్కర్ నామాన్ని జపిస్తే మాత్రం రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం, ఆత్మగౌరవ జీవితం లభిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. అమిత్ షా ఆలోచనల్లో సమానత్వం లేదని ఆరోపించారు. ఆ భావజాలానికి ఆయన దూరంగా ఉన్నారన్నారు. అంబేడ్కర్ ఫిలాసఫీ పెరిగే కొద్దీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rss) భావజాలం తగ్గిపోతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కాగా, ఇటీవల రాజ్యసభలో అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags:    

Similar News