Punjab building collapse: పంజాబ్ లో భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి
పంజాబ్ లో మొహాలి(Punjab's Mohali) జిల్లాలో మూడంతస్తుల భవనం కుప్పుకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ లో మొహాలి(Punjab's Mohali) జిల్లాలో మూడంతస్తుల భవనం కుప్పుకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) కు చెందిన 20 ఏళ్ల యువతి సహా మరొకరు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రగాయాలైన దృష్టి వర్మ అనే యువతిని శిథిలాల కింది రెస్క్యూ బృందాలు గుర్తించాయి. అయితే, తీవ్ గాయాలైన ఆమెను సోహానా ఆస్పత్రికి తరలించారు. కాగా.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ యువతి చనిపోయిందని వెల్లడించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్‌మెంట్ కోసం తవ్వకాలు జరుగుతుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ బిల్డింగ్ లో జిమ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భవనం శిథిలాల కింద దాదాపు పదిమంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
సహాయక చర్యలు
మొహాలీలోని (Punjab building collapse)భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (NDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. గత 12 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 కింద భవన యజమానులు, పర్వీందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్‌లపై కేసు నమోదు చేశారు. భవనం కూలిపోవడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Punjab Chief Minister Bhagwant Mann) విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆనంద్‌పూర్ సాహిబ్ ఎంపీ మల్వీందర్ సింగ్ కాంగ్, మొహాలీ ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ మాట్లాడుతూ.. "ఇది దురదృష్టకర ఘటన, రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది” అని అన్నారు.