GST Council Meeting: ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. తీసుకున్న నిర్ణయాలివే..!

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నేతృత్వంలో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం(GST Council Meeting) ముగిసింది.

Update: 2024-12-21 16:29 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నేతృత్వంలో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం(GST Council Meeting) ముగిసింది. రాజస్థాన్(Rajasthan)లోని జైసల్మేర్‌(Jaisalmer) వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. అలాగే విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF)ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఏకాభిప్రాయం కుదరలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు. రైతులు ఎండుమిర్చి, ఎండు ద్రాక్ష విక్రయాలపై జీఎస్టీ రద్దు నిర్ణయం తీసుకున్నామని, ఇక ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని మినహాయింపు అంశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని వెల్లడించారు.

జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న పలు నిర్ణయాలివే..

  • స్విగ్గీ, జొమాటో డెలివరీ ఛార్జీలపై పన్ను రేట్ల తగ్గింపుపై నిర్ణయం వాయిదా.
  • రూ. 2000లోపు లావాదేవీలు నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు. ఫిన్ టెక్ సంస్థలకు వర్తించదు.
  • రుణ గ్రహీతలపై బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ వేసే ఫైన్ లపై జీఎస్టీ తొలగింపు.
  • ఫోర్ట్ ఫైడ్ బియ్యం గింజలపై జీఎస్టీ 5 శాతం తగ్గింపు, జన్యు చికిత్సలకు జీఎస్టీ మినహాయింపు.
  • పాత కార్లపై జీఎస్టీ 18 శాతానికి పెంపు.
Tags:    

Similar News