అయోధ్యలో మా అభ్యర్థి విజయం రాముడి అభిమతం.. అఖిలేష్ కీలక వ్యాఖ్యలు

పార్లమెంట్ సమావేశాలు మంగళవారం కొనసాగుతున్నాయి.

Update: 2024-07-02 07:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ సమావేశాలు మంగళవారం కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ మాట్లాడుతూ.. అయోధ్యలో తమ అభ్యర్థి విజయం రాముడి అభిమతం అన్నారు. ఏక పక్షం కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ముందు 400కు పైగా అనే నినాదం ఇచ్చారని.. ఎన్నికల్లో ఇండియా కూటమికి నైతిక విజయం లభించిందన్నారు. ఇండియా కూటమిదే నైతిక విజయమని ప్రజలకు అర్థమైందన్నారు.

సానుకూల రాజకీయాలతోనే ఇండియా కూటమికి నైతిక విజయం దక్కిందన్నారు. ఇది కొనసాగే ప్రభుత్వం కాదని.. పడిపోయే ప్రభుత్వం అని ప్రజలు చెబుతున్నారని ఎన్డీయే కూటమి సర్కారును ఉద్దేశించి అఖిలేష్ కామెంట్స్ చేశారు. 2024 జూన్ 4 అనేది సంప్రదాయ రాజకీయాలకు అంతం పలికిన రోజు అన్నారు. సంప్రదాయ రాజకీయాలకు దేశ ప్రజలు మంగళం పాడారని అఖిలేష్ అభివర్ణించారు. ఐదో ఆర్థిక వ్యవస్థగా మారినట్లు సర్కారు గొప్పలు చెబుతోందని.. ఐదో ఆర్థిక వ్యవస్థగా చెబుతున్నా తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నామన్నారు.


Similar News