IPhone Ban : ఇండోనేషియాలో ఐఫోన్ 16పై బ్యాన్

Update: 2024-10-25 15:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రఖ్యాత యాపిల్(Apple) కంపెనీ లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16 (IPhone16)పై ఇండోనేషియా(Indonesia) నిషేధం విధించింది. తమ దేశంలో ఈ ఫోన్ వాడటం, విక్రయించడంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇండోనేషియాలో పెట్టుబడులకు ఇచ్చిన హామీలను యాపిల్ నెరవేర్చకపోవడం వలన అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో 1.71 మిలియన్ల పెట్టుబడి పెడతామని, కేవలం 1.48 మిలియన్లు మాత్రమే పెట్టుబడి పెట్టిందని.. అందుకే ఐఫోన్ కంపెనీపై ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొంది. అలాగే ఇండోనేషియాలో ఐఫోన్ 16 విక్రయించాలంటే 40% ఫోన్ ఉత్పత్తులు ఆ దేశంలోనే తయారు చేయాలన్న నిబంధనను కూడ ఆపిల్ సంస్థ అతిక్రమించిందని సమాచారం. అయితే ఈ నిషేధం ఇతర దేశాల్లో కొని, తమ దేశంలో వాడుతున్న వారికి మాత్రమే వర్తిస్తుందని.. ఫోన్ కు సంబంధించిన ఐఎంఈఐను బ్యాన్ చేసింది. కాగా ఇండోనేషియా నిర్ణయంతో ఆ మోడల్ వాడుతున్న వారు షాక్ గురవుతున్నారు.   

Tags:    

Similar News