Sanjay Verma : కెనడా పోలీసుల ఎదుటే ఖలిస్తానీలు నన్ను పొడిచారు : భారత హైకమిషనర్ సంజయ్
దిశ, నేషనల్ బ్యూరో : ఖలిస్తానీ ఉగ్రమూకలు తనపై భౌతికదాడికి పాల్పడిన ఒక ఘటనను కెనడాకు భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ(Sanjay Verma) గుర్తు చేసుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఖలిస్తానీ ఉగ్రమూకలు తనపై భౌతికదాడికి పాల్పడిన ఒక ఘటనను కెనడాకు భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ(Sanjay Verma) గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకసారి కెనడాలోని(Canada) ఆల్బర్టాలో నాపై ఖలిస్తానీ వేర్పాటువాదులు దాడి చేశారు. ఒక ఉగ్రవాది పదునైన కిర్పాన్‌తో నన్ను పొడిచాడు’’ అని ఆయన వెల్లడించారు. కెనడా పోలీసులు చూస్తుండగానే తనపై ఈ దాడి జరిగిందన్నారు. పోలీసుల ఎదుటే తనను ఖలిస్తానీలు(Khalistan) బెదిరించారని సంజయ్ కుమార్ వర్మ చెప్పారు.
ఖలిస్తానీల దాడిపై తాను ఫిర్యాదు ఇచ్చాక.. దాని గురించి కెనడా పోలీసులను ఎప్పుడు ఆరాతీసినా ‘దర్యాప్తు కొనసాగుతోంది’ అనే సమాధానమే వచ్చిందన్నారు. ‘‘ఒకసారి కెనడాలో ఖలిస్తానీ మూకలు దీపావళి టైంలో నా ఫొటోతో రావణుడి దిష్టిబొమ్మను తయారు చేయించి దహనం చేశారు. ఇంకొందరు వేర్పాటువాదులు నా ఫొటోతో కూడిన పోస్టరుపై తుపాకులతో ఫైరింగ్ చేశారు. దీనిపై నేను ఫిర్యాదు చేసినా కెనడా పోలీసులు, అక్కడి ప్రభుత్వం స్పందించలేదు’’ అని సంజయ్ కుమార్ వర్మ తెలిపారు. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవివరాలను వెల్లడించారు.