Autopsy Reports : ఓ బాలుడు, తల్లి, నానమ్మ.. దారుణంగా చంపిన కుకీ మిలిటెంట్లు
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్(Manipur)లోని జిరిబామ్(Jiribam) జిల్లాలో నవంబరు 11న కుకీ మిలిటెంట్లు.. మెయితీ వర్గానికి చెందిన తొమ్మిది మందిని కిడ్నాప్ చేసి హత్య చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్(Manipur)లోని జిరిబామ్(Jiribam) జిల్లాలో నవంబరు 11న కుకీ మిలిటెంట్లు.. మెయితీ వర్గానికి చెందిన తొమ్మిది మందిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. వారిలో పలువురి డెడ్‌బాడీలకు పోస్టుమార్టం(Autopsy Reports) నిర్వహించిన అసోంలోని సిల్చార్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నివేదికలను విడుదల చేశారు. వాటి ప్రకారం.. మూడేళ్ల బాలుడి డెడ్‌బాడీలో ఒక కన్ను కనిపించలేదు. అతడి పుర్రెలో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఆ బాలుడి ఛాతీపై దెబ్బలు, కత్తిగాట్లు ఉన్నాయి. అతడి నుదుటిపై గాయాలు ఉన్నాయి.
సదరు బాలుడి డెడ్‌బాడీ పూర్తిగా కుళ్లిపోయిన తర్వాత దొరికిందని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తేల్చారు. ఈ బాలుడి తల్లి మృతదేహంపై మూడు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు శవపరీక్షలో గుర్తించారు. అతడి నానమ్మ(60) శరీరంపై ఐదు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. వాటిలో ఒక బుల్లెట్ గాయం పుర్రెలో, రెండు బుల్లెట్ గాయాలు ఛాతీలో, మరొక బుల్లెట్ గాయం పొట్టలో, ఇంకొక బుల్లెట్ గాయం భుజంలో ఉందని తేలింది. ఇంకొందరు మహిళలు, పిల్లల పోస్టుమార్టం నివేదికలు వెల్లడి కావాల్సి ఉంది.