AI ChatBot : ఏఐతో ప్రేమ.. కోర్టుకెక్కిన తల్లి
ఏఐ చాట్‌బాట్(AI ChatBot)తో ప్రేమలో పడిన 14 ఏళ్ల పిల్లాడు ఆత్మహత్య చేసుకోవడంతో అతడి తల్లి కోర్టుకెక్కింది.
దిశ, వెబ్ డెస్క్ : ఏఐ చాట్‌బాట్(AI ChatBot)తో ప్రేమలో పడిన 14 ఏళ్ల పిల్లాడు ఆత్మహత్య చేసుకోవడంతో అతడి తల్లి కోర్టుకెక్కింది. చాట్‌బాట్ ‘డేనెరిస్ టార్గారియన్’తో సంభాషణ తర్వాత తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించిన ఆమె ఆ క్యారెక్టర్ సృష్టికర్త అయిన కంపెనీతోపాటు గూగుల్(Google)పైనా దావా వేశారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌లోని క్యారెక్టర్ అయిన టార్గారియన్ పేరుతో సృష్టించిన ఈ చాట్‌బాట్‌కు పిల్లాడు సెవెల్ సెట్జెర్ బానిసయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దానితో మాట్లాడిన తర్వాత తన తండ్రి హ్యాండ్‌గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి ఆత్మహత్యకు చాట్‌బాటే కారణమని.. దాని సృష్టికర్త కంపెనీతోపాటు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో అతడి తల్లి దావా వేశారు. ఈ కేసుపై గూగుల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ క్యారెక్టర్ ఏఐ ఉత్పత్తుల అభివృద్ధిలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.