Digital Arrest: 'డిజిటల్ అరెస్ట్' సైబర్ మోసాలపై ఎండీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్
నేరం ఏదైనా సరే (Digital Arrest) 'డిజిటల్ అరెస్ట్' అనేదే ఉండదని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TGSRTC MD Sajjanar) పేర్కొన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నేరం ఏదైనా సరే (Digital Arrest) 'డిజిటల్ అరెస్ట్' అనేదే ఉండదని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TGSRTC MD Sajjanar) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా సైబర్ మోసాలపై ఆసక్తికర పోస్ట్ చేశారు. నేరస్తులను నేరుగానే దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేస్తారని తెలిపారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే అది మోసం అని గుర్తుంచుకోవాలని సూచించారు.
సైబర్ మోసాల్లో (Cyber frauds) చిక్కుకోవడానికి గల కారణం అవగాహన లోపమేనని చెప్పారు. మన దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా అడగదని, లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఫోన్ లేదా ఆన్ లైన్ ద్వారా బెదిరించవని స్పష్టం చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ కాల్స్ వస్తే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.