MLC Kavitha: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో ఎమ్మెల్సీ కవిత.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ దేవాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ దేవాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సందర్శించారు. ఆదివారం ఉదయం (Secunderabad Mutyalamma Temple) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారుల వేదమంత్రాల ద్వారా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఇటీవలే అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తన బృందంతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
అదేవిధంగా ఆలయంలో జరిగిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజులు, శివసత్తులతో కలిసి ఫోటోలు దిగారు. కాగా, సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టాపన జరిగింది.