Addanki Dayakar : సంధ్య థియేటర్ అంశంలో బీఆర్ఎస్ ఎటు వైపు? : అద్దంకి దయాకర్
సంధ్య థియేటర్ అంశం(Sandhya Theater Incident)లో విపక్ష బీఆర్ఎస్(BRS) ఎటువైపు ఉంటుందో చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్(Addanki Dayakar) డిమాండ్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ అంశం(Sandhya Theater Incident)లో విపక్ష బీఆర్ఎస్(BRS) ఎటువైపు ఉంటుందో చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్(Addanki Dayakar) డిమాండ్ చేశారు. ఘటనలో చనిపోయిన రేవతి వైపా అరెస్టు అయిన అల్లుఅర్జున్ వైపా అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పాలని అన్నారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, ఓ ఆడబిడ్డ చావుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటే తప్పా? అని ప్రశ్నించారు. ఇంతగా రచ్చ చేస్తున్న నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం దారుణం అన్నారు. విమర్శిస్తున్న వారెవరూ రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదని.. అల్లు అర్జున్ అరెస్టును మాత్రం ఖండిస్తున్నారని, దీనిని బట్టి బీఆర్ఎస్ నాయకుల వైఖరి ఏమిటో అర్థం అవుతోందని దయాకర్ మండిపడ్డారు.
పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్లో(Sandhya Theater) జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ(Assembly Sessions) వేదికగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తొక్కిసలాటకు అల్లు అర్జున్ రోడ్ షో కారణమని, హీరో బాధ్యత లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. ఒక్కరోజు జైలుకు వెళ్ళి వస్తే సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారని.. రేవతి కుటుంబాన్ని, ఆసుపత్రిలో ఉన్న బాలున్ని గాని ఎవరూ పరామర్శించలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో దూమరాన్ని రేపుతున్నాయి.