Hyderabad:అల్లు అర్జున్ ఇంటి పై దాడి.. పిల్లలను మామ ఇంటికి తరలింపు
హైదరాబాద్(Hyderabad)లోని అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసిన ఆరుగురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ,వెబ్డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసిన ఆరుగురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జునే(Allu Arjun) కారణమంటూ నినాదాలు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గేటు లోపలికి వెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. అయితే దాడి సమయంలో బన్నీ ఇంట్లో లేరని తెలుస్తోంది. బన్నీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అల్లు అర్జున్ ఇంటి పై దాడి నేపథ్యంలో అతని మామ చంద్రశేఖర్(Chandrashekar) ఈ ఘటనపై ఆరా తీశారు. పిల్లలు అయాన్(Allu Ayaan), అర్హను(Arha) అల్లు అర్జున్ సిబ్బంది ఆయన ఇంటికి తరలించారు. కాగా తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
Also Read ...
Shocking incident:స్క్రీన్ మీద ‘పుష్ప-2’ మూవీ.. థియేటర్లో నిందితుడి అరెస్ట్