Gyanvapi : జ్ఞానవాపి మసీదులో అదనపు సర్వేపై వారణాసి కోర్టు కీలక తీర్పు

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి(Gyanvapi) మసీదు కాంప్లెక్సులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)తో అదనపు సర్వే నిర్వహించాలంటూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను వారణాసి(Varanasi) కోర్టు కొట్టివేసింది.

Update: 2024-10-25 15:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి(Gyanvapi) మసీదు కాంప్లెక్సులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)తో అదనపు సర్వే నిర్వహించాలంటూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను వారణాసి(Varanasi) కోర్టు కొట్టివేసింది. వారణాసిలోని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యుగుల్ శంభు ఈమేరకు శుక్రవారం తీర్పును వెలువరించారు. ఈ తీర్పును తాము అలహాబాద్ హైకోర్టు లేదా జిల్లా కోర్టులో సవాల్ చేస్తామని హిందూపక్షం తరఫు పిటిషనర్, న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగి వెల్లడించారు.

ఆర్కియా లాజికల్ పద్ధతులు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్), జియో రేడియాలజీ సిస్టమ్ ప్రకారం జ్ఞానవాపి మసీదు కాంప్లెక్సులో ఏఎస్ఐ (ASI)తో మరో సర్వే చేయించాలని తన పిటిషన్‌లో విజయ్ శంకర్ రస్తోగి కోరారు. మసీదు మధ్యనున్న ప్రధాన గుమ్మటం, సెల్లార్లు, గేట్లు, ఛాంబర్లను క్షుణ్నంగా సర్వే చేయించాలన్నారు. ఈక్రమంలో ఆయా నిర్మాణాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని పేర్కొన్నారు. అయితే అదనపు సర్వే చేయించలేమని ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News