కిక్కే కిక్కు...సెలైన్ లో కలుపుకుని వైన్ తాగేశాడు ?
మందుబాబులు అప్పుడప్పుడు చేసే పనులు... అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. బాగా తాగి రోడ్డుపై పడుకోవడం, లేదా వాంతులు చేసుక

దిశ, వెబ్ డెస్క్ : మందుబాబులు అప్పుడప్పుడు చేసే పనులు... అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. బాగా తాగి రోడ్డుపై పడుకోవడం, లేదా వాంతులు చేసుకోవడం లాంటివి చేస్తారు. అయితే తాజాగా ఓ మందు బాబు.. చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సోడా అలాగే నీళ్లు లేవని.. సెలైన్ బాటిల్ లో ( IV fluid ) వైన్ కలిపేసి తాగేశాడు ఓ మందు బాబు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
బీహార్ కు ( Bihar) చెందిన ఓ మందు బాబు.. తాజాగా లిక్కర్ ( Liquor) బాటిల్ కొనుక్కున్నాడు. అయితే ఆ సమయానికి అందుబాటులో వాటర్ అలాగే సోడా ( Soda) లేవట. అదే సమయానికి సెలైన్ బాటిల్ తీసుకున్న మందు బాబు... అందులో లిక్కర్ ను కలిపారు. ఆ తర్వాత ఆ లిక్కర్ తాగేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ లిక్కర్ తాగిన మందుబాబు ఉన్నాడా? చనిపోయాడా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలా సెలైన్ బాటిల్ తో లిక్కర్ తాగితే క్యాన్సర్ అస్సలు రాదని మరి కొంత మంది అంటున్నారు. బీహార్ లో ఎండాకాలం కాబట్టి నీళ్లు దొరకడం లేదని... అక్కడ నీటి సమస్యను ఆ మందు బాబు ఈ విధంగా తెలియజేస్తున్నాడని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాడు ఇలా చేస్తాడని మరికొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు.