హర్యానాలో కొత్త టెక్నాలజీ!.. భారీ వర్షంలో రోడ్ల నిర్మాణం.. టెక్నాలజీ పేటెంట్ రైట్స్ మోడీకే

ఓ వైపు భారీ వర్షం వస్తుండగా.. మరో వైపు కొత్త రోడ్ల నిర్మాణం చేస్తున్న విచత్ర ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

Update: 2024-07-01 13:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ వైపు భారీ వర్షం వస్తుండగా.. మరో వైపు కొత్త రోడ్ల నిర్మాణం చేస్తున్న విచత్ర ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి రోడ్ల పై నీరు చేరి రాకపోకలకు సైతం ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉండగా ఈ భారీ వర్షాలకు హర్యానా ప్రభుత్వం కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఓ వైపు వర్షం కురుస్తూ.. రోడ్లపై నీరు చేరినా సరే మరోవైపు రోడ్ల నిర్మాణం మాత్రం ఆపకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో హర్యానా ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. భారీ వర్షంలో రోడ్లు వేయడం ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు.

దీనిపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం కొత్త టెక్నాలజీని కనిపెట్టిందని, దీంతో వర్షాలు కురుస్తున్న సమయంలో కూడా రోడ్లు నిర్మిస్తున్నారని విమర్శించింది. ఈ టెక్నాలజీకి నరేంద్ర మోడీ పేరు మీద పేటెంట్ ఉంటుందని, ఈ సాంకేతికత పేరు - వర్షంలో రోడ్లు వేయండి, అవినీతి నుండి డబ్బు సంపాదించండి అని సంచలన ఆరోపణలు చేసింది. ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. హర్యానాలో కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికేందుకే ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు అని, ఇంత నాణ్యమైన రోడ్లపై ఎలా తిరగాలి అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.


Similar News