Kumari Selja: కాంగ్రెస్ నా రక్తంలో ప్రవహిస్తోంది.. ఎంపీ కుమారి సెల్జా

కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల ఆ పార్టీ సీనియర్ నేత కుమారి సెల్జా బీజేపీలో చేరతారని కథనాలు వెలువడుతున్నాయి.

Update: 2024-09-23 11:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కుమారి సెల్జా బీజేపీలో చేరతారని కొంత కాలంగా పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై సెల్జా క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఆమె ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. కాంగ్రెస్ నా రక్తంలో ప్రవహిస్తోందని తెలిపారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ పై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. కానీ కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాటిని బహిరంగపర్చడం సరికాదన్నారు. రాష్ట్రంలో పార్టీ ముందుకు సాగుతోందని నొక్కి చెప్పారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా అధిష్టానం నిర్ణయమని తెలిపారు.

కాగా, సిర్సా నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచిన సెల్జా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు టికెట్ కేటాయించలేదు. ప్రచారానికి సైతం ఆమె దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా బీజేపీ విమర్శలు గుప్పింస్తోంది. సెల్జాను బీజేపీలో చేరాలని ఆహ్వానించడంతో పాటు.. దళితులను కాంగ్రెస్ అవమానిస్తోందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెల్జా స్పందించి పై వ్యాఖ్యలు చేశారు.


Similar News